Sanchitha Basu: ఇప్పుడు అందరి దృష్టి ఓటీటీ క్వీన్ పైనే!

- బీహార్ లో పుట్టిపెరిగిన బ్యూటీ
- సోషల్ మీడియా ద్వారా పాప్యులర్
- 'తుక్రా కే మేరా ప్యార్'తో మరింత పెరిగిన క్రేజ్
- ఇతర భాషల నుంచి క్యూ కడుతున్న అవకాశాలు
ఒకప్పుడు టాలెంట్ ఉన్నవాళ్లు అవకాశాలను వెతుక్కుంటూ వెళ్ళడానికీ, నలుగురి దృష్టిలో పడటానికి చాలా సమయం పడుతూ ఉండేది. ఒకవేళ తెరపై కనిపించే అవకాశం వచ్చినా, క్రేజ్ రావడానికి అదృష్టం తోడు కావలసి వచ్చేది. కానీ ఇప్పుడు ఉన్న సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్ వలన టాలెంట్ ను చూపించడానికి .. అవకాశాలను రప్పించుకోవడానికి ఎక్కువ రోజులు పట్టడం లేదు. అలా ఫాస్టుగా ఎదిగిన బ్యూటీగా 'సంచిత బసు' కనిపిస్తుంది.

ముద్దుగా .. ముద్దమందారంలా కనిపించే సంచిత చుట్టూ ఇప్పుడు వెబ్ సిరీస్ లు తిరుగుతున్నాయి. ఇటీవల వచ్చిన 'తుక్రా కే మేరా ప్యార్' వెబ్ సిరీస్ ఆమె క్రేజ్ ను మరింతగా పెంచేసింది. ఈ సిరీస్ లో ఆమె నటన హైలైట్ గా నిలిచింది. ఆల్రెడీ అభిమానులు ఆమెను ఓటీటీ క్వీన్ గా పిలుచుకోవడం మొదలైపోయింది. తెలుగుతో పాటు ఇతర బాషల నుంచి కూడా అవకాశాలు ఆమె ఇంటిబాట పట్టినట్టుగా టాక్. అచ్చు అంజలి మాదిరిగానే అనిపించే ఈ బ్యూటీ, ఏ రేంజ్ లో బిజీ అవుతుందో చూడాలి మరి.
