PRTU: నల్గొండ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో శ్రీపాల్ రెడ్డి, కరీంనగర్ నుండి మల్కా కొమురయ్య గెలుపు

MLA Election results in Telangana

  • నల్గొండ-ఖమ్మం-వరంగల్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీఆర్టీయూ అభ్యర్థి గెలుపు
  • కరీంనగర్-మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్ నుండి మల్కా కొమురయ్య విజయం
  • మల్కా కొమురయ్యకు మద్దతు పలికిన బీజేపీ

తెలంగాణలో జరిగిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీఆర్టీయూ, బీజేపీ మద్దతిచ్చిన అభ్యర్థులు గెలుపొందారు. నల్గొండ-ఖమ్మం-వరంగల్ పీఆర్టీయూ అభ్యర్థి శ్రీపాల్ రెడ్డి, కరీంనగర్-మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్ ఎన్నికల్లో మల్కా కొమురయ్య విజయం సాధించారు. మల్కా కొమురయ్యకు బీజేపీ మద్దతు పలికింది.

శ్రీపాల్ రెడ్డి రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో విజయం సాధించారు. మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఎవరికీ మ్యాజిక్ ఫిగర్ రాకపోవడంతో ఎలిమినేషన్ ప్రక్రియను చేపట్టారు. దీంతో రెండో ప్రాధాన్యత ఓట్లతో సిట్టింగ్ ఎమ్మెల్సీ నర్సిరెడ్డిపై శ్రీపాల్ రెడ్డి విజయం సాధించారు.

బీజేపీ మద్దతు పలికిన మల్కా కొమురయ్యకు 12,959 మొదటి ప్రాధాన్యత ఓట్లు వచ్చాయి. ఆయన పీఆర్టీయూ అభ్యర్థి వంగ మహేందర్ రెడ్డిపై విజయం సాధించారు. విజయం సాధించేందుకు 12,081 ఓట్లుగా అధికారులు నిర్ధారించారు. మల్కా కొమురయ్యకు 12,959 ఓట్లు వచ్చాయి.

PRTU
BJP
Telangana
Graduate MLC Elections
  • Loading...

More Telugu News