HYDRA: హైదరాబాద్‌లోని అక్రమ హోర్డింగులపై హైడ్రా కమిషనర్ కీలక ఆదేశాలు

HYDRA Ranganath on hordings

  • అనుమతులు లేని హోర్డింగులను తొలగించాలని ఆదేశం
  • ఆదివారంలోగా యాడ్ ఏజెన్సీలే స్వయంగా తొలగించాలన్న హైడ్రా కమిషనర్
  • తొలగింపులో ఎలాంటి మినహాయింపులు ఉండవని స్పష్టీకరణ

హైదరాబాద్ నగరంలోని అక్రమ హోర్డింగులపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక ఆదేశాలు జారీ చేశారు. నగరంలో అనుమతులు లేని ప్రకటనల హోర్డింగులను తొలగించాలని ఆదేశించారు. అనుమతులు లేని హోర్డింగులను యాడ్ ఏజెన్సీలే స్వయంగా తొలగించాలని స్పష్టం చేశారు.

అనుమతులు లేని హోర్డింగులను తొలగించేందుకు వచ్చే ఆదివారం వరకు గడువు ఇస్తున్నట్లు యాడ్ ఏజెన్సీలకు తేల్చి చెప్పారు. నిబంధనలను ఉల్లంఘించి ఏర్పాటు చేసిన హోర్డింగులను ఆ తర్వాత హైడ్రా తొలగిస్తుందని స్పష్టం చేశారు. అక్రమ హోర్డింగుల తొలగింపులో ఎలాంటి మినహాయింపులు ఉండవని స్పష్టం చేశారు.

HYDRA
Ranganath
Hyderabad
Congress
  • Loading...

More Telugu News