IIT Baba: గంజాయితో దొరికిపోయిన ఐఐటీ బాబా

- ఇటీవల కుంభమేళాతో ఐఐటీ బాబాగా ఫేమస్ అయిన అభయ్ సింగ్
- ఛాంపియన్స్ ట్రోఫీలో తప్పుడు జోస్యంతో విమర్శలపాలు
- ఇటీవల ఓ న్యూస్ డిబేట్ లో తనను కొట్టారని ఆరోపణలు
- మరోసారి వార్తల్లోకెక్కిన ఐఐటీ బాబా
ఐఐటీ బాబా పేరిట ఎంతో ఫేమస్ అయిన అభయ్ సింగ్ తాజాగా గంజాయితో దొరికిపోయాడు.
కుంభమేళా సందర్భంగా ఎంతో పాప్యులారిటీ పొందిన ఈ ఐఐటీ బాబా... ఇటీవల ఛాంపియన్స్ ట్రోఫీలో దాయాదుల పోరు సందర్భంగా... పాక్ పై కోహ్లీ పరుగులు చేయలేడని, ఈ మ్యాచ్ లో బారత్ ఓడిపోతుందని చెప్పాడు. కానీ ఆ మ్యాచ్ లో కోహ్లీ సెంచరీ చేయడం, టీమిండియా గెలవడం అందరికీ తెలిసిందే. దాంతో ఐఐటీ బాబాపై తీవ్ర విమర్శలు వచ్చాయి.
ఆ తర్వాత టీవీ చానల్ డిబేట్ లో తనను కొట్టారని ఆరోపణలు చేశాడు. ఆ వ్యవహారం సద్దుమణిగింది అనుకునే లోపు... లేటెస్ట్ గా గంజాయి వ్యవహారంలో చిక్కుకున్నాడు.
గంజాయి కేసులో అతడిని జైపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. జైపూర్ లో ఓ హోటల్ లో ఉన్న ఐఐటీ బాబా నుంచి గంజాయి, ఇంకా పలు మాదక ద్రవ్యాలు కూడా స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది.
దీనిపై ఐఐటీ బాబా స్పందిస్తూ... తన వద్ద లభించింది గంజాయి కాదని, ప్రసాదం అని చెప్పుకొచ్చాడు. ఈ ప్రసాదం సేవించడం తప్పు అయితే, కుంభమేళాలో అనేకమంది ఈ ప్రసాదాన్ని తీసుకున్నారని, వాళ్లందరినీ కూడా అరెస్ట్ చేయాల్సి ఉంటుందని అన్నాడు. కాగా, జైపూర్ పోలీసులు అతడిపై ఎన్డీపీఎస్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.