KTR: జీఎస్టీ వసూళ్లు తగ్గడంపై కేటీఆర్ విమర్శలు

KTR responds on GST reevenue

  • కరోనా కంటే కాంగ్రెస్ ప్రమాదకారి అని కేటీఆర్ ఆగ్రహం
  • గత ఏడాది పది శాతం నమోదైన జీఎస్టీ వసూళ్లు ఒక్క శాతం వృద్ధికి పడిపోయాయన్న కేటీఆర్
  • చెత్త నిర్ణయాలతో ఆర్థిక రంగంలో విధ్వంసం జరిగిందన్న కేటీఆర్

తెలంగాణలో జీఎస్టీ రాబడులు తగ్గడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 'ఎక్స్' వేదికగా స్పందించారు. కరోనా కంటే కాంగ్రెస్ ప్రమాదకారి అని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఏడాది క్రితం చెప్పిందే ఈరోజు అక్షరాలా నిజమైందని అన్నారు. గత ఏడాది పది శాతం నమోదైన జీఎస్టీ వసూళ్లు కేవలం ఒకే ఒక్కశాతం వృద్ధికి పడిపోవడం సిగ్గుచేటు అన్నారు.

చెత్త నిర్ణయాలతో తెలంగాణ ఆర్థిక రంగంలో విధ్వంసం జరిగిందని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ఘోర తప్పిదాల వల్లే ఈ సంక్షోభం అని ఆయన అన్నారు. ప్రభుత్వ పెద్దల కమీషన్లు ఆకాశాన్ని అంటుతుంటే రాష్ట్ర రాబడులు మాత్రం కుప్పకూలడం క్షమించరాని నేరమని అన్నారు. కేసీఆర్ పదేళ్ల స్వర్ణయుగాన్ని చెరిపేసి ముఖ్యమంత్రి రాసుకునే చీకటి చరిత్ర ఇదేనా? అని ధ్వజమెత్తారు.

KTR
Telangana
Revanth Reddy
Congress
  • Loading...

More Telugu News