Machines: మనుషులు చేసే పనులు యంత్రాలు చేస్తే... వీడియో వైరల్

చికెన్ కొట్టడం, గొడ్డు మాంసం, పంది మాంసాన్ని గ్రిల్ చేసేందుకు దారంతో చుట్టడం, కొబ్బరి బోండాలు కొట్టడం, బంగాళాదుంపల తొక్కు ఒలవడం... ఇవన్నీ మనుషులు చేసే పనులుగానే మనకు తెలుసు. ఇవే పనులను యంత్రాలు చేస్తే ఎలా ఉంటుందో అనుకుంటున్నారో... అయితే ఈ వీడియో చూడండి. ఇందులో ఆయా పనులను మెషీన్ల సాయంతో ఎంతో సులువుగా, వేగంగా చేయడం చూడొచ్చు. ఈ ఫుడ్ ప్రాసెసింగ్ నైపుణ్యాలకు సంబంధించిన టిక్ టాక్ వీడియోకు సోషల్ మీడియాలో విశేష స్పందన వస్తోంది.