VV Vinayak: దర్శకుడు వీవీ వినాయక్ ఆరోగ్యంపై పుకార్లు... తీవ్రంగా ఖండించిన ఆయ‌న టీమ్‌!

Director VV Vinayak Team Clarifies Rumors on His Health

  • దర్శకుడు వీవీ వినాయక్ ఆరోగ్యంపై ఈ రోజు ఉద‌యం త‌ప్పుడు వార్తలు
  • అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరార‌నేది ఆ వార్త‌ల సారాంశం
  • పలు మాధ్య‌మాల్లో వార్త‌ల ప్ర‌చారం
  • ఆయ‌న ఆరోగ్యంపై కొన్ని మాధ్య‌మాల్లో వ‌స్తున్న వార్త‌లు అవాస్త‌వమన్న వినాయక్ టీమ్
  • ద‌ర్శ‌కుడు సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నార‌ని వెల్ల‌డి

టాలీవుడ్ ప్ర‌ముఖ‌ దర్శకుడు వీవీ వినాయక్ ఆరోగ్యంపై ఈ రోజు ఉద‌యం త‌ప్పుడు వార్తలు పుట్టుకొచ్చాయి. ఆయ‌న అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరార‌నేది ఆ వార్త‌ల సారాంశం. పలు మాధ్య‌మాల్లో ఈ వార్త‌లు ప్ర‌చారం కావ‌డం గ‌మ‌నార్హం. దీంతో ఈ వార్త‌ల‌పై ఆయ‌న టీమ్ తాజాగా స్పందించింది. ఒక నోట్‌ను కూడా టీమ్ విడుద‌ల చేసింది. 

ప్ర‌ముఖ‌ దర్శకుడు వీవీ వినాయక్ ఆరోగ్యంపై కొన్ని మాధ్య‌మాల్లో వ‌స్తున్న వార్త‌లు అవాస్త‌వమ‌ని టీమ్ పేర్కొంది. ఆయ‌న సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నార‌ని తెలిపింది. ఇలాంటి త‌ప్పుడు వార్త‌లు ప్ర‌చారం చేయ‌కుండా వాస్త‌వాలు తెలుసుకొని ప్ర‌చురించాల‌ని విజ్ఞ‌ప్తి చేసింది. ఇక‌పై ఇలాంటి త‌ప్పుడు వార్త‌లను ప్ర‌చారం చేసే వారిపై చ‌ట్టప‌రంగా క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవ‌డం జ‌రుగుతుంద‌ని ఆయన టీమ్ హెచ్చ‌రించింది. 

  • Loading...

More Telugu News