KCR: బీఆర్ఎస్ నేతకు రూ. 10 లక్షల ఆర్థికసాయం చేసిన కేసీఆర్

KCR 10 laks financial assistance to BRS leader

  • అనారోగ్యంతో బాధపడుతున్న సుబ్బారావు
  • సుబ్బారావును ఫామ్ హౌస్ కు ఆహ్వానించిన కేసీఆర్
  • పార్టీ అండగా ఉంటుందని ధైర్యం చెప్పిన బీఆర్ఎస్ అధినేత

బీఆర్ఎస్ నేత డోకుపర్తి సుబ్బారావుకు ఆ పార్టీ అధినేత కేసీఆర్ అండగా నిలిచారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సుబ్బారావును ఎర్రవల్లిలోని తన ఫామ్ హౌస్ కు కేసీఆర్ ఆహ్వానించారు. ఈ క్రమంలో తన భార్యతో కలిసి ఫామ్ హౌస్ కు సుబ్బారావు వెళ్లారు. ఈ సందర్భంగా సుబ్బారావు యోగ క్షేమాలను కేసీఆర్ అడిగి తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండాలని, పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. వైద్య ఖర్చుల కోసం రూ. 10 లక్షల చెక్ ను సుబ్బారావుకు అందించారు. కేసీఆర్ సాయంపై సుబ్బారావు దంపతులు కృతజ్ఞతలు తెలిపారు. ఖమ్మం పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ కోసం సుబ్బారావు ఎంతో కృషి చేశారు. పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా వ్యవహరించేవారు. గతంలో కేసీఆర్ ఏ1గా ఉన్న ఓ కేసులో సుబ్బారావు ఏ2గా ఉండటం గమనార్హం.  

  • Loading...

More Telugu News