AP & TS: ఏపీ, తెలంగాణలో కొనసాగుతున్న ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ

MLC election counting in AP and Telangana

  • ఏపీలో 3, తెలంగాణలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు
  • ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఓట్ల లెక్కింపు
  • సాయంత్రంలోగా వెల్లడికానున్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఫలితాలు

ఏపీ, తెలంగాణలో ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమయింది. అభ్యర్థులు, ఏజెంట్ల సమక్షంలో అధికారులు స్ట్రాంగ్ రూమ్ ను తెరిచారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఫలితాలు ఈ సాయంత్రంలోగా వెల్లడికానున్నాయి. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఫలితాలు రావడానికి మాత్రం రెండు, మూడు రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. 

ఫిబ్రవరి 27న ఏపీ, తెలంగాణల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. ఏపీలో రెండు పట్టభద్రులు, ఒక ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. తెలంగాణలో ఒక పట్టభద్రులు, రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఏపీలో మూడు ఎమ్మెల్సీ స్థానాల బరిలో 70 మంది అభ్యర్థులు, తెలంగాణలో మూడు ఎమ్మెల్సీ స్థానాల బరిలో 90 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. 

  • Loading...

More Telugu News