Vidadala Rajini: జగనన్న మోసపోయాడు అంతే: విడదల రజని

Vidadala Rajini shares a video in social media
  • సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్టు పెట్టిన విడదల రజని
  • తామంతా జగనన్నకే ఓటేశాం అంటూ ఓ మహిళ వెల్లడి
  • జగనన్న ఈవీఎంల కారణంగానే ఓడిపోయాడన్న మహిళ
వైసీపీ నేత, మాజీ మంత్రి విడదల రజని సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్టు పెట్టారు. జనం ఎవరూ జగనన్నను మోసం చేయలేదు, జగనన్న మోసపోయాడు అంతే అంటూ ఆ పోస్టులో పేర్కొన్నారు. పేదల గుండెల్లో చెరగని ముద్ర వేసిన ప్రజా నాయకుడు జగనన్న అని కీర్తించారు. ఈ మేరకు విడదల రజని ఓ వీడియోను కూడా పంచుకున్నారు. 

ఆ వీడియోలో విడదల రజని కార్లో కూర్చుని ఉండగా... ఓ మహిళ కారు విండో వద్ద నిలుచుకుని మాట్లాడడం చూడొచ్చు. "మేం అందరం జగనన్నకే ఓటేశాం అక్కా... మేం మోసం చేయలేదు అక్కా... మాకు తెలిసిన వాళ్లుకూడా జగనన్నకే ఓటేశారు అక్కా... మేం ఎంతమందిని అడిగినా, మేం జగనన్నకే వేశాం అని చెప్పారు... ఈవీఎంలు మోసం చేశాయి కానీ, అన్నను జనం మోసం చేయలేదు అక్కా" అంటూ ఆ మహిళ పేర్కొనడం వీడియోలో ఉంది. కాగా, ఎక్కడ్నించి వచ్చారు అంటూ ఆ మహిళను విడదల రజని ప్రశ్నించగా.... చోడవరం అంటూ ఆమె బదులిచ్చింది.
Vidadala Rajini
Jagan
YSRCP
Social Media

More Telugu News