Woman Elope: భర్త నుంచి తప్పించుకునేందుకు ప్రియుడితో కలిసి రన్నింగ్ బస్ ఎక్కి పరారైన భార్య.. వీడియో ఇదిగో!

medchal woman elope with lover

  • ఆన్ లైన్ ప్రేమ.. భర్త, ఇద్దరు పిల్లలను వదిలేసి వెళ్లిన మహిళ
  • మేడ్చల్ లో ప్రియుడితో బైక్ పై వెళుతున్న భార్యను వెంటాడిన భర్త
  • బైక్ వదిలేసి బస్ ఎక్కి పారిపోయిన జంట

ఆన్ లైన్ లో పరిచయమైన యువకుడి కోసం ఓ వివాహిత తన భర్తను, ఇద్దరు పిల్లలను వదిలేసి వెళ్లిపోయింది. ప్రియుడితో బైక్ పై వెళుతుండగా ఫాలో అవుతున్న భర్తను తప్పించుకునేందుకు రన్నింగ్ బస్ ఎక్కి వెళ్లిపోయింది. చేసేదేంలేక ఆ భర్త పోలీసులను ఆశ్రయించాడు. మేడ్చల్ జిల్లా పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుందీ ఘటన.

బాధితుడు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పేట్ బషీరాబాద్ కు చెందిన సుకన్య(35) కు సోషల్ మీడియాలో గోపీ అనే 22 ఏళ్ల యువకుడు పరిచయమయ్యాడు. ఆన్ లైన్ చాటింగ్, ఫోన్ లో మాట్లాడుకోవడంతో ఈ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. సుకన్యకు అప్పటికే వివాహం జరగగా ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. అయినా గోపి లేకుండా ఉండలేనని భావించిన సుకన్య.. ప్రియుడితో పారిపోయేందుకు సిద్ధమైంది. ఫిబ్రవరి 5న ఇంట్లో నుంచి వెళ్లిపోయి గోపితో కలిసి ఉంటోంది.

భార్య కనిపించడం లేదంటూ సుకన్య భర్త ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగి సీసీ కెమెరాల ఆధారంగా గోపితో వెళ్లిందని నిర్ధారించుకున్నారు. వారికోసం గాలిస్తుండగా మేడ్చల్ లోని ఆక్సిజన్ పార్క్ వద్ద బైక్ పై వెళుతున్న గోపి, సుకన్య కనిపించారు. దీంతో వారిని ఆపి విచారిస్తుండగా.. బైక్ ను అక్కడే వదిలేసి సుకన్య, గోపి రన్నింగ్ బస్ ఎక్కి మళ్లీ పారిపోయారు. మేడ్చల్ లో సంచలనం సృష్టించిన ఈ కేసులో సుకన్య, గోపి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Woman Elope
Online Love
Medchal
Running Bus

More Telugu News