Crime News: భార్య ప్రియుడి దాడిలో తీవ్రంగా గాయపడిన డాక్టర్ సుమంత్‌రెడ్డి మృతి

Doctor who was attacked by wife boy friend died

  • కాజీపేటలో క్లినిక్ నిర్వహిస్తున్న డాక్టర్ సుమంత్‌రెడ్డి
  • భర్తను తొలగించుకునేందుకు ప్రియుడితో కలిసి హత్యకు కుట్ర
  • గత నెల 20న కారులో వెళ్తున్న సుమంత్‌రెడ్డిని బైక్‌పై వెంబడించి దాడి
  • 9 రోజులపాటు మృత్యువుతో పోరాడి ప్రాణాలు విడిచిన వైద్యుడు

భార్య ప్రియుడి దాడిలో తీవ్రంగా గాయపడిన హనుమకొండ జిల్లా వైద్యుడు డాక్టర్ సుమంత్‌రెడ్డి (36) చికిత్స పొందుతూ మృతి చెందారు. దీంతో హత్యాయత్నం కేసును హత్య కేసుగా మార్చిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వారి కథనం ప్రకారం.. కాజీపేటలో క్లినిక్ నిర్వహిస్తున్న సుమంత్‌రెడ్డి గత నెల 20న రాత్రి కారులో ఇంటికి వెళుతుండగా బైక్‌పై వెంబడించిన ఇద్దరు నిందితులు భట్టుపల్లి శివారులో ఆయనపై దాడిచేశారు. సుత్తితో ఆయన తలపై బలంగా మోదడంతో తీవ్రంగా గాయపడ్డారు.

గుర్తించిన స్థానికులు వెంటనే ఆయనను వరంగల్ ఎంజీఎంకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో తర్వాతి రోజు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. రెండు రోజుల క్రితం మళ్లీ వరంగల్ ఎంజీఎంకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ నిన్న ఉదయం సుమంత్‌రెడ్డి మరణించారు. 9 రోజులపాటు మృత్యువుతో పోరాడి మృతి చెందడంతో కుటుంబంలో విషాదం అలముకుంది.

ఈ కేసు దర్యాప్తులో కీలక విషయాలు వెల్లడయ్యాయి. ప్రియుడి మోజులో పడిన సుమంత్‌రెడ్డి భార్య ఫ్లోరా మారియా సహకారంతో సంగారెడ్డికి చెందిన ఆమె ప్రియుడు ఎర్రోళ్ల శామ్యూల్, అతడి స్నేహితుడు, ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ మంచుకూరి రాజ్‌కుమార్‌ కలిసి ఈ దారుణానికి ఒడిగట్టినట్టు గుర్తించారు. గత నెల 27న వారిని అరెస్ట్ చేసి జైలుకు పంపారు.

Crime News
Dr Sumanth Reddy
Kazipet
Warangal
  • Loading...

More Telugu News