Rushikonda Beach: రుషికొండ బీచ్‌కు బ్లూ ఫ్లాగ్ గుర్తింపు రద్దు

Blue Flag certification cancelled to Rushikonda beach
  • 2020లో రుషికొండ బీచ్‌కు బ్లూఫాగ్ గుర్తింపు
  • బీచ్ నిర్వహణ అధ్వానంగా మారడంతో ఎఫ్ఈఈకి కొందరు ఫిర్యాదు
  • గుర్తింపు రద్దు కావడంతో జెండాలను కిందికి దించేసిన అధికారులు
విశాఖపట్నంలోని రుషికొండ బీచ్ అత్యంత ప్రతిష్ఠాత్మకమైన బ్లూఫ్లాగ్ గుర్తింపును కోల్పోయింది. రుషికొండ వద్ద 600 మీటర్ల తీర ప్రాంతాన్ని బ్లూఫాగ్ బీచ్‌గా ధ్రువీకరిస్తూ 2020లో డెన్మార్క్‌కు చెందిన ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ (ఎఫ్ఈఈ) సంస్థ సర్టిఫికెట్ అందించింది. అయితే, కొంతకాలంగా ఇక్కడి బీచ్‌లోకి శునకాలు రావడం, సీసీ కెమెరాలు పనిచేయకపోవడం, వ్యర్థాలు పేరుకుపోవడం, మూత్రశాలలు, దుస్తులు మార్చుకునే గదులు అధ్వానంగా తయారుకావడం, నడక మార్గాలు దెబ్బతిన్న విషయాన్ని గుర్తించిన కొందరు ఫొటోలతో ఎఫ్ఈఈ సంస్థకు గత నెల 13న ఫిర్యాదు చేశారు. 

దీనిని తీవ్రంగా పరిగణించిన సంస్థ రుషికొండ బీచ్‌కు బ్లూ ఫాగ్ గుర్తింపును రద్దు చేసింది. దీంతో పర్యాటక శాఖ అధికారులు నిన్న తీరంలోని జెండాలను కిందికి దించేశారు. కాగా, ఏడాది క్రితం వరకు బీచ్‌ను నిర్వహణను చూసుకున్న సంస్థ నిర్వహణ ఒప్పందం ముగియడంతో తప్పుకుంది. 
Rushikonda Beach
Visakhapatnam
Blue Flag

More Telugu News