Yadadri Bhuvanagiri District: యాదగిరి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

Laxminarasimhaswamy brahmotsawalu started

  • నేటి నుండి మార్చి 11వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు
  • ఆలయ గోపురానికి బంగారు తాపడం అనంతరం మొదటి బ్రహ్మోత్సవాలు
  • గర్భాలయంలోని స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అర్చకులు

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. నేడు ప్రారంభమైన ఈ బ్రహ్మోత్సవాలు ఈ నెల 11వ తేదీ వరకు జరుగుతాయి. ఆలయ గోపురానికి బంగారు తాపడం అనంతరం వచ్చిన బ్రహ్మోత్సవాలు ఇవి. ఈ బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.

మొదటిరోజు శ్రీ విష్వక్సేనారాధన, స్వస్తివాచనం, రక్షాబంధనం పూజలు, వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. మొదట గర్భాలయంలోని స్వయంభు నారసింహస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అర్చకులు బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టారు.

Yadadri Bhuvanagiri District
Telangana
  • Loading...

More Telugu News