Job Notifications: జేఎన్టీయూ-హెచ్ జాబ్ మేళాలో తోపులాట... పోలీసుల జోక్యం

Job Mela in JNTUH

  • ఉద్యోగ మేళాను ప్రారంభించిన ఎంపీ ఈటల రాజేందర్
  • కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా ప్రారంభించినట్లు వైస్ ఛాన్సలర్ వెల్లడి
  • సుమారు 90 కంపెనీలు ఉద్యోగ మేళాలో పాల్గొంటున్నాయని వెల్లడి

హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి జేఎన్టీయూలో నిర్వహిస్తోన్న మెగా జాబ్ మేళాకు పెద్ద ఎత్తున అభ్యర్థులు హాజరయ్యారు. ఉద్యోగార్థులు పోటెత్తడంతో తోపులాట చోటు చేసుకుంది. పోలీసులు జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ఉద్యోగ మేళాకు మల్కాజ్‌గిరి ఎంపీ, బీజేపీ నేత ఈటల రాజేందర్ ముఖ్య అతిథిగా హాజరై, ప్రారంభించారు.

జేఎన్టీయూ హైదరాబాద్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా ఈ ఉద్యోగ మేళాను ఏర్పాటు చేశామని జేఎన్టీయూ-హెచ్ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కిషన్ కుమార్ రెడ్డి తెలిపారు. సుమారు 90 కంపెనీలు ఈ ఉద్యోగ మేళాలో పాల్గొంటున్నాయని చెప్పారు.  

  • Loading...

More Telugu News