Posani Krishna Murali: పోసానికి అస్వస్థత... ఆసుపత్రికి తరలింపు

- రాజంపేట జైల్లో ఉన్న పోసాని
- ఛాతీలో నొప్పిగా ఉందని జైలు సిబ్బందికి చెప్పిన పోసాని
- స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో పోసానికి చికిత్స అందిస్తున్న వైద్యులు
సినీ పరిశ్రమలో విభేదాలు, వర్గ వైషమ్యాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయడం, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో సినీ నటుడు పోసాని కృష్ణమురళికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ప్రస్తుతం ఆయన రాజంపేట సబ్ జైల్లో ఉన్నారు. జైల్లో ఆయనకు ప్రత్యేక గదిని కేటాయించారు. మరోవైపు, జైల్లో ఉన్న పోసాని అస్వస్థతకు గురయ్యారు. ఛాతీలో నొప్పిగా ఉందని చెప్పడంతో ఆయనను జైలు సిబ్బంది స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. చికిత్స అనంతరం ఆయనను మళ్లీ జైలుకు తరలిస్తారు.