Teenmaar Mallanna: తీన్మార్ మల్లన్న సస్పెన్షన్‌పై స్పందించిన పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్

PCC chief responds on Teenmar Mallanna suspention
  • కులగణన పత్రాలను తగులబెట్టడాన్ని తీవ్రంగా పరిగణించామన్న టీపీసీసీ చీఫ్
  • పార్టీ షోకాజ్ నోటీసులు జారీ చేస్తే స్పందించలేదని ఆగ్రహం
  • పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు ఎవరు పాల్పడినా చర్యలు తప్పవని హెచ్చరిక
పార్టీ నుండి తీన్మార్ మల్లన్న సస్పెన్షన్‌పై తెలంగాణ పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ స్పందించారు. తీన్మార్ మల్లన్న కులగణన పత్రాలను తగులబెట్టారని, దీనిని తీవ్రంగా పరిగణించినట్లు చెప్పారు. పార్టీ షోకాజ్ నోటీసులు జారీ చేస్తే, దానికి కూడా స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని అంశాలను పరిశీలించిన తర్వాతే తీన్మార్ మల్లన్నను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు చెప్పారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు ఎవరు పాల్పడినా చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణనను తీన్మార్ మల్లన్న తప్పుబట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

పార్టీలో ఉంటూ పార్టీ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడటం, కులగణన పత్రాలను తగులబెట్టడంతో ఫిబ్రవరి 5న కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. పార్టీ వ్యతిరేక చర్యలపై వివరణ కోరింది. ఫిబ్రవరి 12వ తేదీలోపు వివరణ ఇవ్వాలని ఆ నోటీసుల్లో పేర్కొంది. గడువులోగా తీన్మార్ మల్లన్న నుంచి సమాధానం రాకపోవడంతో తాజాగా సస్పెండ్ చేసింది.
Teenmaar Mallanna
Mahesh Kumar Goud
Congress
Telangana

More Telugu News