Posani Krishna Murali: పోసాని బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా... ఇతర కేసుల్లో అరెస్ట్ చేసేందుకు రెడీగా ఉన్న పోలీసులు

- రాజంపేట సబ్ జైల్లో ఉన్న పోసాని
- ప్రత్యేక గదిని కేటాయించామన్న జైలు అధికారులు
- పీటీ వారెంట్ వేయడానికి రెడీగా ఉన్న అనంతపురం, రైల్వేకోడూరు అర్బన్ పోలీసులు
రాజంపేట సబ్ జైల్లో ఉన్న సినీ నటుడు పోసాని కృష్ణమురళి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై రైల్వే కోడూరు కోర్టులో విచారణ సోమవారానికి వాయిదా పడింది. ఈరోజు, రేపు కోర్టుకు సెలవు కావడంతో పిటిషన్ ను సోమవారం విచారించనున్నారు.
మరోవైపు పోసానిని తమకు అప్పగించాలంటూ అనంతపురం, రైల్వేకోడూరు అర్బన్ పీఎస్ పోలీసులు కోర్టులో పీటీ వారెంట్ వేయడానికి రెడీ అవుతున్నారు. ప్రస్తుత కేసులో బెయిల్ వచ్చినా ఇతర కేసుల్లో పోసానిని అరెస్ట్ చేసేందుకు ఆయా పోలీస్ స్టేషన్ల పోలీసులు సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. మరోవైపు సబ్ జైల్లో పోసానికి ప్రత్యేక గదిని కేటాయించినట్టు జైలు అధికారులు తెలిపారు. నిన్న రాత్రి పోసానికి మరోసారి వైద్య పరీక్షలు నిర్వహించారు.