Teenmar Mallanna: ఎమ్మెల్సీ తీన్మార్ మ‌ల్ల‌న్నపై సస్పెన్షన్ వేటు

Congress MLC Teenmar Mallanna Suspended Fron Party
  • ఆయ‌న్ను పార్టీ నుంచి స‌స్పెండ్ చేసిన‌ట్లు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ వెల్లడి
  • పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారన్న కారణంతో ఫిబ్రవరి 5న షోకాజ్ నోటీసు
  • ఫిబ్రవరి 12లోపు వివరణ ఇవ్వాలన్న టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ
  • తీన్మార్ మల్లన్న నుంచి ఎలాంటి వివరణ రాక‌పోవ‌డంతో చ‌ర్య‌లు  
ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న (చింతపండు నవీన్ కుమార్)కు కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం షాకిచ్చింది. ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఈ మేరకు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ వెల్లడించింది. 

పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారన్న కారణంతో ఆయ‌న‌కు ఫిబ్రవరి 5న టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీసు జారీ చేసిన సంగ‌తి తెలిసిందే. ఫిబ్రవరి 12లోపు వివరణ ఇవ్వాలని పేర్కొంది. అయితే, తీన్మార్ మల్లన్న నుంచి ఎలాంటి వివరణ రాలేదు. ఈ నేపథ్యంలో పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ డాక్టర్ జి. చిన్నారెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.
Teenmar Mallanna
Congress
MLC
Telangana

More Telugu News