Manchu Vishnu: శత్రువులపై విరుచుకు పడుతున్న 'కన్నప్ప'... టీజర్ రిలీజ్!

Kannappa Teaser Relesed

  • 'కన్నప్ప'గా కనిపించనున్న మంచు విష్ణు
  • భారీ తారాగణాన్ని కవర్ చేస్తూ టీజర్ 
  • యుద్ధవీరుడిలా కనిపిస్తున్న కన్నప్ప 
  • ఏప్రిల్ 25వ తేదీన సినిమా రిలీజ్


మంచు విష్ణు కథానాయకుడిగా 'కన్నప్ప' సినిమా రూపొందింది. సొంత బ్యానర్ పై ఆయన నిర్మించిన ఈ సినిమా, ఏప్రిల్ 25వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. మహా శివభక్తుడైన 'తిన్నడు' కథ ఇది. పరమశివుడికి తన రెండు కళ్లను సమర్పించడానికి సిద్ధపడిన 'కన్నప్ప' కథ ఇది. అలాంటి ఈ సినిమా నుంచి కొంతసేపటి క్రితం టీజర్ ను రిలీజ్ చేశారు.

గిరిజన తెగలు... ఆ తెగలకు సంబంధించిన నాయకులు... వాళ్ల మధ్య పోరాటం... తిన్నడి పరాక్రమం... పరమశివుడి పట్ల తిన్నడికి గల నిరసన భావం... అంతటి నాస్తికుడు భక్తుడిగా ఎలా మారతాడు అంటూ సాక్షాత్తు పార్వతీదేవి... పరమశివుడి దగ్గర ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసిన సన్నివేశాలపై ఈ టీజర్ ను కట్ చేశారు. మంచు విష్ణు మొదలు ఈ సినిమాలో ప్రధానమైన పాత్రధారులందరినీ కవర్ చేస్తూ ఈ టీజర్ ను వదిలారు. 

అక్షయ్ కుమార్, మోహన్ బాబు, ప్రభాస్, శరత్ కుమార్, దేవరాజ్, ముఖేశ్ ఋషి, మోహన్ లాల్, కాజల్, మధుబాల ఇలా అందరూ ఈ టీజర్ లో కనిపించేలా చూసుకున్నారు. కృష్ణంరాజు 'భక్త కన్నప్ప' మూవీ ఆరంభంలో తిన్నడు నాస్తికుడిగా, కండబలం చూసుకుని మురిసిపోయేవాడిలా మాత్రమే కనిపిస్తాడు. కానీ 'కన్నప్ప'లో తిన్నడిని ఒక మహావీరుడిగా చూపించే ప్రయత్నం చేసినట్టుగా టీజర్ ను బట్టి అర్థమవుతోంది.

Manchu Vishnu
Mohan Babu
Mohan lal
Akshay Kumar
Prabhas

More Telugu News