KA Paul: ఆ 30 వేల మంది అమ్మాయిల గురించి పవన్ ఎందుకు మాట్లాడడం లేదు?: కేఏ పాల్

- నాడు రూ.50 మందు రూ.150కి అమ్ముతున్నారంటూ పవన్ విమర్శించాడన్న కేఏ పాల్
- ఈ రోజు కల్తీది అంతకంటే దారుణంగా అమ్ముతున్నారంటూ మండిపాటు
- సోషల్ మీడియాలో పాల్ వీడియో వైరల్
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మరోసారి విమర్శలు గుప్పించారు. పవన్‌ను అనుకరిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.
"రూ. 50 మందును రూ. 150కి అమ్ముతున్నారని జగన్‌పై పవన్ తమ్ముడు విమర్శలు చేశారు. మరి ఇప్పుడు వీళ్ళు ఎంతకు అమ్ముతున్నారు? కల్తీ మద్యాన్ని వారి కంటే దారుణంగా అమ్ముతున్నారు" అని పాల్ ఆరోపించారు.
"గతంలో 30 వేల మంది మహిళలు, చిన్న అమ్మాయిలు మిస్సయ్యారన్నారు. తాము అధికారంలోకి రాగానే వారందరినీ వెనక్కి తీసుకొస్తామని పవన్ చెప్పారు. ఈ రోజు ఆ 30 వేల మంది అమ్మాయిల గురించి ఒక్కసారైనా మాట్లాడారా?" అని పాల్ ప్రశ్నించారు. పవన్‌ను అనుకరిస్తూ కేఏ పాల్ చేసిన ఈ వ్యాఖ్యల వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.