Chandrababu: రేపు చిత్తూరు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన

CM Chandrababu will visit Ramanaidupalle tomorrow

  • ఏపీలో రేపు (మార్చి 1) పెన్షన్ల పంపిణీ
  • జీడీ నెల్లూరులోని రామానాయుడుపల్లెలో చంద్రబాబు పర్యటన
  • గ్రామంలోని లబ్ధిదారులకు స్వయంగా పెన్షన్లు అందజేత

ఏపీలో రేపు (మార్చి 1) పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరగనున్న నేపథ్యంలో, సీఎం చంద్రబాబు చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. శనివారం మధ్యాహ్నం 1 గంటకు గంగాధర నెల్లూరులోని రామానాయుడుపల్లె చేరుకోనున్నారు. గ్రామంలో పర్యటించి, పలువురు లబ్ధిదారులకు ఇళ్లకు వెళ్లి స్వయంగా పెన్షన్లు అందించనున్నారు. 

అంతేగాకుండా, గ్రామంలో 10 సూత్రాల కాన్సెప్ట్ తో ఏర్పాటు చేసి స్టాల్స్ ను పరిశీలించనున్నారు. గ్రామంలో ప్రజావేదిక సభలో పాల్గొంటారు. అనంతరం స్థానిక టీడీపీ నేతలను కలిసి వారికి దిశానిర్దేశం చేయనున్నారు. సాయంత్రం 3.55 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుని అమరావతికి తిరుగు ప్రయాణమవుతారు.

Chandrababu
Chittoor District
Pensions
TDP
  • Loading...

More Telugu News