Kiara Advani: తల్లి కాబోతున్న కియారా అద్వానీ

- తల్లి కాబోతున్నట్టు ఇన్స్టా ద్వారా వెల్లడించిన కియారా
- తమ జీవితంలోకి అందమైన బహుమతి రాబోతోందన్న కియారా
- సిద్ధార్థ్ మల్హోత్రాను ప్రేమ వివాహం చేసుకున్న కియారా
ప్రముఖ సినీ నటి కియారా అద్వానీ తల్లి కాబోతోంది. తొలి బిడ్డకు ఆమె జన్మనివ్వబోతోంది. తాను తల్లి కాబోతున్నాననే విషయాన్ని కియారా తన అభిమానులతో ఇన్స్టా ద్వారా పంచుకుంది. తమ జీవితంలోకి అందమైన బహుమతి రాబోతోందని తెలిపింది.
బాలీవుడ్ నటుడు సిద్ధార్థ్ మల్హోత్రాని 2023లో కియారా ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. రాజస్థాన్ జైసల్మేర్ లోని సూర్యగఢ్ ప్యాలస్ లో వీరి పెళ్లి ఘనంగా జరిగింది. 'షేర్షా' సినిమా సమయంలో వీరి ప్రేమ మొదలై పెళ్లి వరకు వెళ్లింది. తల్లిదండ్రులు కాబోతున్న నేపథ్యంలో కియారా, సిద్ధార్థ్ లకు అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.