Stock Market: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు... 1,414 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్

- ఐటీ, బ్యాంకింగ్ స్టాక్స్ లో అమ్మకాల ఒత్తిడి
- 420 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
- 6.19 శాతం పతనమైన టెక్ మహీంద్రా షేరు విలువ
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు కుప్పకూలాయి. ఐటీ, బ్యాంకింగ్ స్టాక్స్ లో అమ్మకాల ఒత్తిడి, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి బలహీన సంకేతాల కారణంగా సూచీలు భారీగా పతనమయ్యాయి. ఇతర ఆసియా మార్కెట్లు కూడా భారీగా నష్టపోయాయి.
ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1,414 పాయింట్లు నష్టపోయి 73,198కి దిగజారింది. నిఫ్టీ 420 పాయింట్లు కోల్పోయి 22,124కి పడిపోయింది. అమెరికా డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ మరో 33 పైసలు బలహీనపడి రూ. 87.51గా ఉంది.
బీఎస్ఈ సెన్సెక్స్ లో టెక్ మహీంద్రా (-6.19%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-5.48%), మహీంద్రా అండ్ మహీంద్రా (-5.21%), భారతి ఎయిర్ టెల్ (-4.86%), ఇన్ఫోసిస్ (-4.32%) టాప్ లూజర్లుగా ఉన్నాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 1.86 శాతం లాభపడింది.