KTR: మంత్రులు చేపకూరతో విందులు చేసుకుంటున్నారు: కేటీఆర్ విమర్శలు

- విషాదంలోనూ మంత్రులు వినోదాలు చేసుకుంటున్నారని విమర్శ
- హాస్టల్ విద్యార్థులకు అన్నం పెట్టకుండా పస్తులు ఉంచుతున్నారని ఆగ్రహం
- విద్యార్థులను గుళ్లో భోజనం తినమని చెప్పారంటూ ఆగ్రహం
తెలంగాణ మంత్రులు హెలికాప్టర్‌లో యాత్రలు చేస్తూ, చేపకూరతో విందు చేసుకుంటున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. రాష్ట్రంలో ప్రజాపాలన పరాకాష్ఠకు చేరుకుందని ఆయన అన్నారు. విషాదంలోనూ మంత్రులు వినోదాలు చేసుకుంటున్నారని ఆరోపించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన ఆరోపణలు చేశారు.
మంత్రులు విందులు చేసుకుంటూ, హాస్టల్ విద్యార్థులకు మాత్రం అన్నం పెట్టకుండా పస్తులు ఉంచుతున్నారని ఆరోపించారు. విద్యార్థులకు కనీసం తిండి పెట్టలేని పరిస్థితుల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉందని ఆయన అన్నారు. శివరాత్రి రోజున... అన్నం వండలేదు, గుడిలో తినండంటూ నాగర్ కర్నూలు జిల్లాలోని కొండనాగుల ఎస్టీ బాలుర హాస్టల్ సిబ్బంది విద్యార్థులకు సూచించడం దారుణమని అన్నారు.
ఇక్కడి ఎస్టీ హాస్టల్లో శివరాత్రి రోజునాడు 380 మంది విద్యార్థులకు గాను 200 మంది ఉన్నారని, మధ్యాహ్నం భోజనం గుదిబండ శివాలయంలో చేసే అన్నదానంలో, రాత్రి భోజనం వీరంరామాజిపల్లిలోని గంగమ్మ దేవాలయంలో అన్నదానానికి వెళ్లి తినమని సిబ్బంది చెప్పారని అన్నారు.