Posani Krishna Murali: పోసానికి రిమాండ్... హైకోర్టుకు వెళతామన్న పొన్నవోలు

Ponnavolu reaction on Posani remand

  • పోసానికి 14 రోజుల రిమాండ్ విధించిన కోర్టు
  • బీఎన్ఎస్ సెక్షన్ 111ను కోర్టు పరిగణనలోకి తీసుకోలేదన్న పొన్నవోలు
  • ఈ విషయంలో తాము సగం సక్సెస్ అయినట్టేనని వ్యాఖ్య 

పవన్ కల్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు, సినీ పరిశ్రమలో విద్వేషాలు రేకెత్తించేలా మాట్లాడిన కేసులో సినీ నటుడు పోసాని కృష్ణమురళికి రైల్వేకోడూరు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. దీనిపై ఆయన తరపు న్యాయవాది, వైసీపీ నేత పొన్నవోలు సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ... రైల్వేకోడూరు కోర్టు తీర్పుపై హైకోర్టుకు వెళతామని చెప్పారు. పోసానికి రిమాండ్ ను విధించడాన్ని పరిశీలిస్తే... ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ అన్నట్టుగా ఉందని తెలిపారు.

పోసానిపై పెట్టిన బీఎన్ఎస్ సెక్షన్ 111ను మేజిస్ట్రేట్ పరిగణలోకి తీసుకోలేదని చెప్పారు. ఈ విషయంలో తాము సగం సక్సెస్ అయినట్టేనని అన్నారు. పోసాని వ్యాఖ్యలు వర్గాల మధ్య వైషమ్యాలను రెచ్చగొట్టేలా ఉన్నాయంటూ పోలీసులు పెట్టిన రెండు సెక్షన్లపై మేజిస్ట్రేట్ ఏకీభవించారని చెప్పారు. అందుకే రిమాండ్ విధించారని అన్నారు. 

Posani Krishna Murali
Tollywood
Ponnavolu Sudhakar Reddy
YSRCP
  • Loading...

More Telugu News