AP Budget 2025-26: ఏపీ బడ్జెట్... హైలైట్స్ - 2

- తొలిసారి పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టిన కూటమి ప్రభుత్వం
- ఎన్టీఆర్ భరోసా పింఛన్లకు రూ. 27,518 కోట్లు
- తల్లికి వందనం పథకానికి రూ. 9,407 కోట్లు
2025-26 ఆర్థిక సంవత్సరానికి ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారి పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టడం జరిగింది. రూ. 3.22 లక్షల కోట్లతో బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. బడ్జెట్ లో వ్యవసాయం, విద్య, సంక్షేమ రంగాలకు ప్రాధాన్యతను ఇచ్చారు.
బడ్జెట్ హైలైట్స్:
- దీపం 2.0 పథకానికి - రూ. 2,601 కోట్లు
- తల్లికి వందనం కోసం - రూ. 9,407 కోట్లు
- పౌరసరఫరాల శాఖకు - 3,806 కోట్లు
- వ్యవసాయ అనుబంధ రంగాలకు - రూ. 13,487 కోట్లు
- జల్ జీవన్ మిషన్ కు - రూ. 2,800 కోట్లు
- మద్యం, మాదకద్రవ్యాల రహిత రాష్ట్రం కోసం నవోదయ 2.0 కార్యక్రమానికి - రూ. 10 కోట్లు
- మత్స్యకార భరోసాకు - రూ. 450 కోట్లు
- డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకానికి - రూ. 3,486 కోట్లు
- ఆదరణ పథకానికి - రూ. 1,000 కోట్లు
- ఆర్టీజీఎస్ కోసం - రూ. 101 కోట్లు
- ఎన్టీఆర్ భరోసా పింఛన్లకు - రూ. 27,518 కోట్లు