: ఇమ్రాన్ ఖాన్ కు థ్యాంక్స్ చెబుతోన్న భారత్ పొలిటీషియన్


బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ పాకిస్తాన్ మాజీ క్రికెటర్, తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్ కు కృతజ్ఞతలు తెలిపారు. అరాచకం దిశగా సాగుతోన్న బీహార్ ను అభివృద్ధి పథంవైపు మళ్ళించిన నితీశ్ కుమార్ పై ఇటీవలే ఇమ్రాన్ ఖాన్ ప్రశంసల వర్షం కురిపించారు. నితీశ్ ను ఆదర్శంగా తీసుకుని తాము పాకిస్తాన్ లోని ఖైబర్ పక్తుంక్వా ప్రభుత్వాన్ని నడిపించాలని భావిస్తున్నామని ఇమ్రాన్ వ్యాఖ్యానించారు.

బీహార్లో అమలు చేస్తున్న విధంగా రాజకీయాలకు అతీతమైన అధికార, పోలీసు విభాగాలను తామూ అనుసరించాలనుకుంటున్నట్టు తెలిపారు. విద్య, వైద్య సదుపాయాల విషయంలో నితీశ్ సర్కారులా పారదర్శకంగా వ్యవహరించాలని ఖైబర్ పక్తుంక్వా ప్రభుత్వానికి సూచించారు. ఇక ఇమ్రాన్ వ్యాఖ్యల పట్ల నితీశ్ స్పందిస్తూ.. థ్యాంక్స్ చెప్పారు.

  • Loading...

More Telugu News