Meenakshi Natarajan: హైదరాబాద్‌కు మీనాక్షి నటరాజన్.. స్వాగతం పలికిన పీసీసీ చీఫ్

Meenakshi Natarajan arrives To Hyderabad

     


తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నూతన ఇన్‌చార్జ్‌గా నియమితులైన ఏఐసీసీ నాయకురాలు మీనాక్షి నటరాజన్ నేడు హైదరాబాద్ చేరుకున్నారు. రైలులో కాచిగూడకు చేరుకున్న ఆమెకు తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ శాలువా కప్పి స్వాగతం పలికారు. 

నేడు గాంధీ భవన్‌లో జరగనున్న తెలంగాణ ప్రదేశ్ కమిటీ విస్తృతస్థాయి కార్యవర్గ సమావేశంలో మీనాక్షితోపాటు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్ట విక్రమార్క, ఏఐసీసీ కార్యదర్శులు ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారు. అలాగే, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, డీసీసీ అధ్యక్షులు సహా పలువురు పాల్గొననున్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర, జాతీయ రాజకీయాలతోపాటు పార్టీ సంస్థాగత అంశాలపై చర్చించనున్నారు.

Meenakshi Natarajan
Congress
Telangana
  • Loading...

More Telugu News