AP Govt: ఏపీలో పింఛ‌ను పంపిణీలో కీల‌క మార్పులు

Pension Disbursement Time Changes in AP

  • ఉద‌యం 4, 5 గంట‌ల నుంచి కాకుండా 7 గంట‌ల నుంచి పింఛ‌‌న్ల పంపిణీ 
  • ఉద‌యం 7 గంట‌ల నుంచి మాత్ర‌మే యాప్ ప‌నిచేసేలా మార్పులు
  • ప్ర‌భుత్వ సందేశాన్ని ల‌బ్ధిదారుల‌కు తెలిపేందుకు యాప్‌లో 20 సెక‌న్ల ఆడియో

ఏపీలో ఎన్‌టీఆర్ భ‌రోసా పింఛ‌న్ల పంపిణీలో రాష్ట్ర ప్ర‌భుత్వం కీల‌క మార్పులు చేసింది. ఇక‌పై ఉద‌యం 4, 5 గంట‌ల నుంచి కాకుండా 7 గంట‌ల నుంచి పింఛ‌‌న్ల పంపిణీ ప్రారంభించాల‌ని నిర్ణ‌యించింది. దీనివ‌ల్ల గ్రామ‌, వార్డు స‌చివాల‌యాల ఉద్యోగుల‌తో పాటు ల‌బ్ధిదారుల‌కు కూడా ఎలాంటి ఇబ్బందులు ఉండవ‌ని పేర్కొంది. ఈ నేప‌థ్యంలోనే ఉద‌యం 7 గంట‌ల నుంచి మాత్ర‌మే యాప్ ప‌నిచేసేలా మార్పులు చేసింది.

అంతేగాక ల‌బ్ధిదారుల ఇళ్ల నుంచి 300 మీట‌ర్ల కంటే ఎక్కువ దూరంలో పంపిణీ చేస్తుంటే ఏ కార‌ణంతో అలా చేయాల్సి వ‌చ్చిందో వెంట‌నే న‌మోదు చేసేలా మార్పులు చేయ‌డం జ‌రిగింది. అలాగే ప్ర‌భుత్వ సందేశాన్ని ల‌బ్ధిదారుల‌కు తెలిపేందుకు 20 సెక‌న్ల ఆడియోను యాప్‌లో ప్లే చేయ‌నున్నారు. ల‌బ్ధిదారుల వివ‌రాలు న‌మోదు చేసిన వెంట‌నే అది ప్లే అవుతుంది. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల కోడ్ నేప‌థ్యంలో దీనిని మొద‌ట మార్చి 1న క‌ర్నూలు, చిత్తూరు జిల్లాల్లో పైలెట్‌గా ప్రారంభించ‌నున్నారు. ఆ త‌ర్వాత రాష్ట్ర‌వ్యాప్తంగా అమ‌లు చేస్తారు. 

AP Govt
Pensions
Andhra Pradesh
  • Loading...

More Telugu News