Kollu Ravindra: పేర్ని నాని భార్య అకౌంట్లోకి డబ్బులు ఎలా జమ అయ్యాయో త్వరలోనే బయటకు వస్తుంది: కొల్లు రవీంద్ర

Kollu Ravindra on Perni Nani

  • పోసానిని చట్టబద్ధంగానే అరెస్ట్ చేశారన్న కొల్లు రవీంద్ర
  • ఇంట్లో ఉన్న ఆడబిడ్డల గురించి అసహ్యంగా మాట్లాడారని మండిపాటు
  • వైసీపీ నేతల పాపాలే వాళ్లను వెంటాడుతున్నాయని వ్యాఖ్య

సినీ నటుడు పోసాని కృష్ణమురళిని పోలీసులు అరెస్ట్ చేయడంపై ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చట్టబద్ధంగానే పోసానిని పోలీసులు అరెస్ట్ చేశారని చెప్పారు. పోసాని మాట్లాడిన తీరును రాష్ట్ర ప్రజలు ఎవరూ మర్చిపోరని అన్నారు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చివరకు ఇలాగే ఉంటుందని చెప్పారు. ఇంట్లో ఉన్న ఆడబిడ్డల గురించి అసహ్యంగా, నీచంగా మాట్లాడాడని మండిపడ్డారు. ఆడబిడ్డలపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసే ఏ ఒక్కరినీ కూటమి ప్రభుత్వం వదలదని హెచ్చరించారు. 

రెడ్ బుక్ రాజ్యాంగాన్నే అమలు చేయాలనుకుంటే ప్రభుత్వం వచ్చిన రెండు నెలల్లోనే అందరినీ లోపలకు పంపించేవాళ్లమని చెప్పారు. వైసీపీ నేతలు చేసిన పాపాలే వాళ్లను వెంటాడుతున్నాయని అన్నారు. తమ ప్రభుత్వ హయాంలో ప్రజలంతా సంతోషంగా ఉన్నారని చెప్పారు. మాజీ మంత్రి పేర్ని నాని ఫ్రస్టేషన్ లో ఉన్నారని అన్నారు. ఆయన భార్య జయసుధ అకౌంట్ లోకి డబ్బులు ఎలా జమ అయ్యాయో త్వరలోనే బయటకు వస్తాయని చెప్పారు. కాకినాడ షిప్పుల్లో బియ్యం అక్రమంగా ఎలా రవాణా అయిందో వివరాలన్నీ ఉన్నాయని తెలిపారు.

Kollu Ravindra
Telugudesam
Posani Krishna Murali
Perni Nani
YSRCP
  • Loading...

More Telugu News