Gorantla Madhav: వంశీ, పోసాని బుక్ అయ్యారు... తాజాగా వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ కు షాక్ ఇచ్చిన పోలీసులు

Police notices to Gorantla Madhav

  • పోక్సో కేసులో ఉన్న బాధితుల వివరాలను బహిరంగంగా వెల్లడించిన కేసు
  • మాధవ్ పై కేసు పెట్టిన వాసిరెడ్డి పద్మ
  • విచారణకు హాజరు కావాలంటూ మాధవ్ కి నోటీసులు ఇచ్చిన సైబర్ క్రైమ్ పోలీసులు

వైసీపీ కీలక నేతలకు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే వల్లభనేని వంశీ, పోసాని కృష్ణమురళి, నందిగం సురేశ్ వంటి నేతలు కేసుల్లో బుక్ అయ్యారు. తాజాగా వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ వంతు వచ్చినట్టుంది. వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అయిన మాధవ్ కు భారీ షాక్ తగిలింది. పోక్సో కేసులో బాధితుల వివరాలను మీడియా సమావేశంలో గోరంట్ల మాధవ్ బహిరంగంగా వెల్లడించారు. ఈ వ్యవహారంపై ఏపీ మహిళా కమిషన్ మాజీ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ 2024 నవంబర్ 2న ఫిర్యాదు చేశారు. 

ఈ క్రమంలో... మాధవ్ ఇంటికి పోలీసులు వెళ్లారు. మార్చి 5న విచారణకు హాజరుకావాలంటూ సైబర్ క్రైమ్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. మాధవ్ పై పోలీసులు బీఎన్ఎస్ సెక్షన్లు 72, 79 కింద కేసు బుక్ చేశారు. తమ ముందు విచారణకు హాజరై... వివరణ ఇవ్వాలని పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు.

Gorantla Madhav
YSRCP
  • Loading...

More Telugu News