Sikandar Teaser: సల్మాన్ 'సికిందర్' టీజర్ వచ్చేసింది!

- సల్మాన్ ఖాన్, ఏఆర్ మురుగదాస్ కాంబోలో 'సికిందర్'
- సల్లూభాయ్ సరసన కథానాయికగా రష్మిక మందన్న
- ఈ ఏడాది రంజాన్ కానుకగా సినిమా విడుదల
బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్, రష్మిక మందన్న జంటగా ప్రముఖ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం సికిందర్. భావోద్వేగాలతో కూడిన ఈ చిత్రాన్ని ప్రముఖ బాలీవుడ్ నిర్మాత సాజిద్ నడియాడ్‌వాలా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు.
మరోసారి సల్లూభాయ్ తనదైన స్టైల్‌లో యాక్షన్ సీన్స్‌తో అదరగొట్టారు. అలాగే మురుగదాస్ కూడా మళ్లీ తనదైన టేకింగ్‌తో టీజర్‌ను రిచ్‌గా చూపించారు. ఈ ఏడాది రంజాన్ కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు మూవీ టీమ్ ప్రకటించింది.