Pooja Hegde: రజనీకాంత్ సినిమాలో పూజా హెగ్డే ఫస్ట్ లుక్ విడుదల

Pooja Hegde first look in Rajinikanth movie

  • కోలీవుడ్ లో ఆఫర్లు పట్టేస్తున్న పూజా హెగ్డే
  • రజని 'కూలీ' సినిమాలో ఐటెం సాంగ్ చేస్తున్న పూజ
  • విజయ్ సరసన 'నాయగన్' లో నటిస్తున్న కన్నడ భామ

కన్నడ ముద్దుగుమ్మ పూజా హెగ్డేకు టాలీవుడ్ లో ఆఫర్లు తగ్గినా... తమిళ్ లో మాత్రం వస్తున్నాయి. రజనీ కాంత్, దర్శకుడు లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో వస్తున్న 'కూలీ' చిత్రంలో ఆఫర్ కొట్టేసింది. ఈ సినిమాలో ఆమె ఓ ఐటెం సాంగ్ చేస్తోంది. పూజా హెగ్డే ఫస్ట్ లుక్ ను మేకర్స్ విడుదల చేశారు. ఈ సినిమాను సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. నాగార్జున, ఉపేంద్ర, సత్యరాజ్, శృతిహాసన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మరోవైపు కోలీవుడ్ స్టార్ విజయ్ సరసన 'నాయగన్' సినిమాలో నటిస్తోంది.  

More Telugu News