Kubera: ఆసక్తికర పోస్టర్‌తో 'కుబేర' విడుదల తేదీని ప్రకటించిన మేకర్స్

- శేఖర్ కమ్ముల పాన్ఇండియా చిత్రం 'కుబేర'
- ప్రధాన పాత్రల్లో నాగార్జున, ధనుశ్, రష్మిక
- జూన్ 20న చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు ప్రకటించిన మేకర్స్
- సినిమాకు రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం
టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల పాన్ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్న తాజా చిత్రం 'కుబేర'. ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో అక్కినేని నాగార్జున, తమిళ హీరో ధనుశ్ నటిస్తున్నారు. అలాగే రష్మిక మందన్న కీలక పాత్ర పోషిస్తోంది. అయితే, తాజాగా ఈ చిత్రం రిలీజ్ డేట్ ఖరారైంది.
ఈ మేరకు ప్రత్యేక పోస్టర్ ద్వారా కుబేర విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు. జూన్ 20న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు తెలిపారు. కాగా, తాజాగా రిలీజైన పోస్టర్‌ను చిత్ర బృందం ఆసక్తికరంగా రూపొందించింది. ఇక ఇప్పటికే సినిమా నుంచి నాగార్జున, ధనుశ్, రష్మిక ఫస్ట్ లుక్ పోస్టర్లు విడుదల చేశారు. అలాగే రష్మిక క్యారెక్టర్ గ్లింప్స్ తో పాటు టీజర్ కూడా విడుదలైంది.
ఇక ఈ చిత్రం భిన్నమైన సోషల్ డ్రామా కథాంశంతో తెరకెక్కుతున్నట్లు సమాచారం. ఇందులో ధనుశ్‌ను చాలా కొత్తగా చూపించబోతున్నారని టాక్. రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పీ బ్యానర్‌లో సునీల్ నారంగ్, రామ్మోహన్ రావు కలిసి నిర్మిస్తున్నారు.