Posani Krishna Murali: పోసానిపై వైసీపీ హయాంలోనే ఫిర్యాదు చేశాం... అప్పుడు పట్టించుకోలేదు: జోగిమణి

Jogi Mani on Posani Krishna Murali

  • పవన్ కుటుంబం గురించి పోసాని అనుచితంగా మాట్లాడారన్న జోగిమణి
  • సంస్కారం అడ్డొచ్చి తాము అలా మాట్లాడలేదని వ్యాఖ్య
  • ఇష్టానుసారం మాట్లాడటం సమంజసం కాదన్న జోగిమణి

సినీ నటుడు పోసాని కృష్ణమురళిని అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. జనసేన రాయలసీమ జోన్ కన్వీనర్ జోగిమణి ఫిర్యాదు మేరకు పోసానిపై కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా జోగిమణి మాట్లాడుతూ... తమ నాయకుడు పవన్ కుటుంబ సభ్యుల గురించి పోసాని అనుచితంగా మాట్లాడుతుంటే... తాము కూడా అలాగే మాట్లాడాలనుకున్నామని, అయితే అలా మాట్లాడొద్దని పవన్ సూచించారని తెలిపారు. సంస్కారం అడ్డొచ్చి తాము అలా మాట్లాడలేదని... పోసాని ప్రవర్తన సరిగా లేకపోవడం వల్లే ఆయనపై ఫిర్యాదు చేయాల్సి వచ్చిందని చెప్పారు. 

పవన్ పై పోసాని చేసిన వ్యాఖ్యలు విని ఎన్నో నిద్రలేని రాత్రులను గడిపానని జోగిమణి తెలిపారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో కూడా పోసానిపై ఎన్నో ఫిర్యాదులు చేశామని... అప్పుడు తమ ఫిర్యాదులు తీసుకోలేదని చెప్పారు. ఇష్టానుసారం మాట్లాడడం సమంజసం కాదని... నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని అన్నారు.

Posani Krishna Murali
Tollywood
  • Loading...

More Telugu News