Posani Krishna Murali: పోసానిపై నాన్ బెయిలబుల్ కేసులు.. రాజంపేట కోర్టులో ప్రవేశపెట్టనున్న పోలీసులు

Posani Krishna Murali to be produced in Court
  • చంద్రబాబు, పవన్, లోకేశ్ లపై పోసాని అనుచిత వ్యాఖ్యలు
  • హైదరాబాద్ లోని నివాసంలో అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • పోసానిపై మొత్తం 11 కేసుల నమోదు
సినీ నటుడు పోసాని కృష్ణమురళిని ఏపీ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. గచ్చిబౌలిలోని ఆయన నివాసంలో రాయచోటి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాసేపట్లో ఆయనను ఓబులవారిపల్లె పీఎస్ కు తీసుకురానున్నారు. జనసేన నేత మణి ఫిర్యాదు మేకు ఆయనపై కేసు నమోదయింది. ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టులో ప్రవేశ పెట్టే అవకాశం ఉంది. ఆయనపై మొత్తం 11 కేసులు నమోదయ్యాయి. పోసానిపై నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 196, 353 (2), 111 రెడ్ విత్ 3 (5) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

వైసీపీ హయాంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్, నారా లోకేశ్ లపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఆయనపై వచ్చిన ఫిర్యాదుల మేరకు పోలీసులు కేసులు నమోదు చేశారు. నంది అవార్డులపై తీవ్ర విమర్శలు చేసినందుకు కూడా ఆయనపై కేసు నమోదయింది.  
Posani Krishna Murali
Tollywood

More Telugu News