Suspicious Death: ఫిలిం నగర్ లో సినీ కార్మికుడి అనుమానాస్పద మృతి

man suspicious death in film nagar

  • నాగర్ కర్నూలు జిల్లా పనివెల గ్రామానికి చెందిన హుస్సేన్ (55) ఫిలింనగర్‌లోని మాగంటి కాలనీలో నివాసం 
  • హుస్సేన్ ఇంటికి వెళుతూ మార్గమధ్యంలో నిర్మాణంలో ఉన్న భవనంలోకి వెళ్లి కుప్పకూలి మృతి
  • భార్య ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు  

హైదరాబాద్ ఫిలింనగర్ పరిధిలో ఒక సినీ కార్మికుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. నాగర్‌కర్నూలు జిల్లా పనివెల గ్రామానికి చెందిన హుస్సేన్ (55), ఇందిరమ్మ దంపతులు కుమార్తెతో కలిసి ఫిలిం నగర్‌లోని మాగంటి కాలనీలో నివాసం ఉంటున్నారు. 

హుస్సేన్ ఇంటికి వెళుతూ సమీపంలో నిర్మాణంలో ఉన్న భవనంలోకి వెళ్లి కుప్పకూలి మృతి చెందాడు. అక్కడ పనిచేస్తున్న భవన నిర్మాణ కార్మికులు ఈ విషయాన్ని భవన యజమానికి తెలియజేశారు. దీంతో ఆయన వెంటనే అక్కడికి చేరుకుని ప్రహరీ లోపల ఉన్న మృతదేహాన్ని హుస్సేన్ ఇంటికి తరలించాడు. 

మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హుస్సేన్ తల వెనుక మూడు గాయాలు, మోకాలికి, ఎడమ కంటికి గాయాలు అయినట్లు గుర్తించారు. అక్కడి కూలీలు మాత్రం హుస్సేన్ తలకు భవనం లోపల ఉన్న సజ్జ తగిలిందని చెబుతున్నారు. 

అయితే, ఈ ఘటన ప్రమాదవశాత్తు జరిగిందా? లేక ఎవరైనా అక్కడికి పిలిచి పథకం ప్రకారం హత్య చేశారా? అనే కోణంలో ఫిలిం నగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Suspicious Death
Hyderabad
Film Nagar
Crime News
  • Loading...

More Telugu News