Posani Krishna Murali: హైదరాబాద్‌లో సినీ నటుడు పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు

Posani Krishna Murali arrested

  • రాయదుర్గం మై హోం భుజా అపార్టుమెంటులో అరెస్ట్ చేసిన పోలీసులు
  • సినిమా పరిశ్రమపై విమర్శలు చేశారనే ఫిర్యాదు నేపథ్యంలో అరెస్ట్
  • పోసానిపై నాన్-బెయిలబుల్ వారెంటును జారీ చేసిన రాజంపేట కోర్టు

ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణమురళిని ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్‌లోని రాయదుర్గం మై హోం భుజా అపార్టుమెంటులో ఉంటున్న ఆయనను ఏపీలోని రాయచోటి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు చేసి ఏపీకి తరలిస్తున్నారు.

పోసానిపై గతంలో అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. సినిమా పరిశ్రమపై విమర్శలు చేశారని స్థానికులు చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి రాజంపేట కోర్టు పోసానిపై నాన్-బెయిలబుల్ వారెంటును జారీ చేసింది.

ఈ నేపథ్యంలో ఈరోజు పోలీసులు రాయదుర్గం చేరుకొని పోసాని కృష్ణమురళిని అదుపులోకి తీసుకున్నారు. రేపు ఉదయం రాజంపేట కోర్టులో హాజరుపరిచే అవకాశముంది. తనను అరెస్టు చేయడానికి వచ్చిన పోలీసులతో పోసాని వాగ్వాదానికి దిగారు. పోలీసులు అతనిని అతికష్టంమీద అదుపులోకి తీసుకున్నారు.

Posani Krishna Murali
Andhra Pradesh
Telangana
Tollywood
  • Loading...

More Telugu News