Prabhudeva: ప్రభుదేవా కొడుకును చూశారా?

- బహుముఖ ప్రజ్ఞాశాలిగా నిరూపించుకున్న ప్రభుదేవా
- కొరియోగ్రాఫర్ గా ఉన్నతస్థానంలో ఉన్న వైనం
- వారసుడు రిషి రాఘవేంద్రను పరిచయం చేసిన మాస్టర్
భారతీయ సినిమా డ్యాన్స్ చరిత్రలో ప్రభుదేవా పేరిట ప్రత్యేక అధ్యాయం ఉంటుంది. ఒంట్లో ఎముకలు ఉన్నాయా, లేవా అన్నట్టుగా స్ప్రింగులా డ్యాన్స్ చేస్తూ చూపరులను సమ్మోహితులను చేయడం ప్రభుదేవా మాస్టర్ కే చెల్లింది. మైకేల్ జాక్సన్ కు ఇండియన్ వెర్షన్ గా పేరుగాంచిన ప్రభుదేవా.... కొరియోగ్రాఫర్ గానే కాకుండా, నటుడిగా, దర్శకుడిగానూ తన బహుముఖ ప్రజ్ఞను చాటుకున్నారు.
ప్రభుదేవా ఇటీవల ఓ ఈవెంట్ లో తన వారసుడ్ని పరిచయం చేశారు. ఇటీవల చెన్నైలో జరిగిన ఓ ఈవెంట్ లో ప్రభుదేవా, కొడుకు రిషి రాఘవేంద్ర పాల్గొన్నారు. పలువురు హీరోయిన్లు, సెలబ్రిటీలు హాజరైన ఈ కార్యక్రమంలో తండ్రీకొడుకులిద్దరూ కలిసి డ్యాన్స్ చేసి అందరినీ అలరించారు. ఈ వీడియోను ప్రభుదేవా ఇన్ స్టాగ్రామ్ లో పంచుకున్నారు.
తాజాగా, కొడుకు రిషి రాఘవేంద్రతో కలిసి ఉన్న ఫొటోను ప్రభుదేవా ఇవాళ సోషల్ మీడియాలో పంచుకున్నారు. 'కంటిన్యుటీ' అంటూ ఈ ఫొటోకు ఒక్క మాటలో క్యాప్షన్ ఇచ్చారు. తన వారసత్వాన్ని కొడుకు కొనసాగిస్తాడన్న ఉద్దేశంతో ఆ ట్వీట్ చేసినట్టు అర్థమవుతోంది.