Chandrababu: 'మహా భక్తి చానల్' ప్రారంభోత్సవానికి హాజరైన ఏపీ సీఎం చంద్రబాబు

AP CM Chandrababu attends Maha Bhakti Channel inauguration

 


మహా గ్రూప్ నుంచి ఇప్పటికే మహా న్యూస్ పేరిట వార్తా చానల్, మహా మ్యాక్స్ పేరిట ఎంటర్టయిన్ మెంట్ చానళ్లు ఉన్నాయి. తాజాగా ఈ మీడియా సంస్థ నుంచి భక్తి చానల్ వస్తోంది. ఈ చానల్ పేరు మహా భక్తి చానల్. ఇటీవలే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా ఈ ఛానల్ లోగోను ఆవిష్కరించారు. 

నేడు శివరాత్రి సందర్భంగా గుంటూరు సమీపంలోని నాగార్జున యూనివర్సిటీ వద్ద మహా భక్తి చానల్ ప్రారంభోత్సవం జరిగింది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన రుద్రాభిషేకంలోనూ పాల్గొన్నారు. కాగా, చానల్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన నిరంజని అఖాడా మహామండలేశ్వర్ స్వామి కైలాసానంద గిరి జీ మహరాజ్ కు చంద్రబాబు పాదాభివందనం చేసి ఆశీస్సులు అందుకున్నారు. 

ఇటీవల మహా గ్రూప్ అధినేత మహా న్యూస్ వంశీ  మాట్లాడుతూ... ఆ దేవుడు ఆదేశించాడు... ఈ మహా వంశీ పాటిస్తున్నాడు... అంటూ తమ మహా భక్తి చానల్ ప్రారంభోత్సవంపై వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News