Child Witnesses: పిల్లల సాక్ష్యంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

Supreme Court comments on Child witnesses

  • భార్యను చంపిన వ్యక్తి కేసు విచారణ
  • ఆ దంపతుల ఏడేళ్ల కుమార్తె సాక్ష్యం
  • వ్యక్తికి జీవిత ఖైదు విధించిన సుప్రీంకోర్టు
  • పిల్లలకు సాక్షులుగా ఉండేందుకు కనీస వయసేమీ లేదన్న అత్యున్నత న్యాయస్థానం
  • కానీ ట్రయల్ కోర్టులు అప్రమత్తంగా ఉండాలని సూచన

ఏ కేసులోనైనా పెద్దవాళ్ల సాక్ష్యం ఎలా చెల్లుబాటు అవుతుందో, చిన్న పిల్లల సాక్ష్యం కూడా అదే రీతిలో చెల్లుబాటు అవుతుందని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. భార్యను చంపిన ఓ వ్యక్తికి జీవితఖైదు విధించే క్రమంలో ఆ దంపతుల ఏడేళ్ల కుమార్తె సాక్ష్యాన్ని పరిగణనలోకి తీసుకున్న సందర్భంగా సుప్రీం కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. సాక్ష్యాధారాల చట్టంలో ప్రత్యేకంగా సాక్షికి కనీస వయసు ఇంత ఉండాలన్న నిబంధన ఏదీ లేదని పేర్కొంది. సాక్షి చిన్నారి అయినంత మాత్రాన ఆ సాక్ష్యాన్ని తోసిపుచ్చలేమని వివరించింది. 

"అయితే పిల్లల సాక్ష్యాన్ని పరిగణనలోకి తీసుకునే క్రమంలో కోర్టు ఒక ముందుజాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. పిల్లలు ఇతరుల మాయమాటల ఉచ్చులో సులభంగా పడిపోయే ప్రమాదం ఉంటుంది... పిల్లలు నమ్మదగిన సాక్షులుగా ఉండాలంటే, వారు అలాంటి మాయమాటల ప్రభావంలో పడకుండా చూడాలి" అని సుప్రీం ధర్మాసనం అభిప్రాయపడింది. 

పిల్లలు సాక్షులుగా ఉన్నప్పుడు వారు నిజమే చెబుతున్నారా అనేది కోర్టులు లోతుగా పరిశీలించాల్సి ఉంటుందని, ఆ చిన్నారులు స్వచ్ఛందంగా చెబుతున్నారా, ఇతరుల ప్రభావానికి గురై అలా చెబుతున్నారా అనేది గమనించాలని సూచించింది. 

ఒకవేళ పిల్లలు ఎవరి ప్రభావానికైనా లోనై తప్పుడు సాక్ష్యం చెబితే అంతకంటే ప్రమాదం ఇంకోటి ఉండదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ విషయంలో ట్రయల్ కోర్టులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

  • Loading...

More Telugu News