Infosys: ఉద్యోగులకు ఇన్ఫోసిస్ శుభవార్త... 20 శాతం వరకు వేతనాల పెంపు!

Infosys releases salary hike letters

  • ఉద్యోగులకు వేతనాల పెంపుకు సంబంధించి లేఖలు జారీ!
  • అంచనాలు అందుకున్న వారికి 7 శాతం వరకు పెంపు
  • అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారికి 20 శాతం వరకు పెంపు
  • జనవరి 1వ తేదీ నుంచి వేతన పెంపు వర్తింపు

టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. అర్హులైన ఉద్యోగులకు వేతనాల పెంపును అమలు చేయనున్నట్లు తెలిపింది. ఈ మేరకు సంబంధిత ఉద్యోగులకు వేతన పెంపుకు సంబంధించిన లేఖలను కూడా జారీ చేసినట్లు సమాచారం. అర్హులైన ఉద్యోగులకు సగటున 5 శాతం నుంచి 8 శాతం, అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారికి 20 శాతం మేర వేతనాలు పెంచినట్లుగా సమాచారం.

ఇన్ఫోసిస్ తన ఉద్యోగులను మూడు విభాగాలుగా వర్గీకరించింది. అంచనాలు అందుకున్న ఉద్యోగులకు 5 నుంచి 7 శాతం, అంచనాలకు మించి కనబరిచిన వారికి 7 నుంచి 10 శాతం, అత్యుతమ ప్రతిభ కనబరిచిన వారికి 10 నుంచి 20 శాతం వేతన పెంపును అందించినట్లుగా సమాచారం. జనవరి 1వ తేదీ నుంచి ఈ వేతన పెంపు వర్తిస్తుందని సమాచారం.

  • Loading...

More Telugu News