Ramdas Athawale: హిందువులుగా ఉండి రాహుల్ గాంధీ, ఉద్ధవ్ ఠాక్రే కుంభమేళాను సందర్శించలేదు: కేంద్రమంత్రి

Voters Should Boycott Rahul Gandhi For Not Visiting Kumbh says Union Minister

  • రాహుల్ గాంధీ, ఠాక్రేలను బహిష్కరించాలని పిలుపునిచ్చిన కేంద్రమంత్రి
  • ప్రజల మనోభావాలను అవమానపరిచారని విమర్శ
  • హిందువుల ఓట్లు కావాలి కానీ మహాకుంభమేళాకు మాత్రం రాలేదని ఆగ్రహం

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, శివసేన (యూబీటీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రే హిందువుల మనోభావాలను అవమానపరిచారని కేంద్రమంత్రి రాందాస్ అథవాలే ధ్వజమెత్తారు. హిందువుల సెంటిమెంట్లను గౌరవించకుండా, వారిద్దరూ మహా కుంభమేళాను సందర్శించలేదని కేంద్రమంత్రి రాందాస్ అథవాలే విమర్శించారు. ప్రజల మనోభావాలను పరిగణనలోకి తీసుకోలేని అలాంటి నేతలను ప్రజలు బహిష్కరించాలని పిలుపునిచ్చారు.

ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, మహా కుంభమేళాకు రాకుండా వారు హిందూ సమాజాన్ని అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. థాకరే కుటుంబం, గాంధీ కుటుంబం మహా కుంభమేళాలో పాల్గొనలేదని విమర్శించారు. హిందువుగా ఉండి, రాజకీయ నాయకుడిగా ఉంటూ కనీసం హిందువుల మనోభావాలను గౌరవించి అయినా కుంభమేళాకు రావాల్సిందని ఆయన అన్నారు.

రాహుల్ గాంధీ, ఉద్ధవ్ ఠాక్రే హిందువులను ఓట్లు అడుగుతారని, కానీ మహా కుంభమేళాను మాత్రం పక్కన పెట్టారని విమర్శించారు. కాబట్టి హిందూ ఓటర్లు వారిని బహిష్కరించాలని ఆయన పిలుపునిచ్చారు. ఇప్పటికే గత మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు వారికి గుణపాఠం చెప్పారని అన్నారు.

  • Loading...

More Telugu News