Kumbh Mela: నేటితో ముగియనున్న కుంభమేళా... నిరంతరం పర్యవేక్షిస్తున్న యూపీ సీఎం

- శివరాత్రి పర్వదినం రోజున ముగియనున్న కుంభమేళా
- ప్రయాగ్ రాజ్ నుండి 4,500 బస్సులు, వందలాది ప్రత్యేక రైళ్లు ఏర్పాటు
- ఇప్పటి వరకు 64 కోట్ల మంది భక్తుల పుణ్యస్నానాలు
ప్రయాగ్‌రాజ్ కుంభమేళా ఈరోజుతో ముగియనుంది. ఈరోజు ముగింపునకు తోడు శివరాత్రి కావడంతో భక్తులు భారీగా తరలి వచ్చి, గంగలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ సహా పొరుగు రాష్ట్రాల్లో రైల్వే స్టేషన్లు భక్తులతో కిక్కిరిసిపోయాయి.
కుంభమేళా ముగియనున్న నేపథ్యంలో ప్రయాగ్‌రాజ్ నుండి 4,500 బస్సులు, 350 ప్రత్యేక రైళ్లు దేశంలోని వివిధ ప్రాంతాలకు ఏర్పాటు చేశారు. శివరాత్రి పర్వదినం కావడంతో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గోరఖ్‌నాథ్ కంట్రోల్ రూం నుండి అధికారులతో నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగిన ఏర్పాట్లు చేశారు. కుంభమేళాకు 64 కోట్ల మంది భక్తులు వచ్చినట్లు ఉత్తర ప్రదేశ్ వెల్లడించింది. ఈ ఒక్కరోజు ఉదయం 11 గంటల వరకు 90 లక్షల మంది పుణ్యస్నానమాచరించినట్లు తెలిపింది.