Amit Shah: తమిళ ప్రజలు తనను క్షమించాలన్న అమిత్ షా... ఎందుకంటే?

Tamil is World Oldest Language  saysAmit Shah

  • ప్రపంచంలోనే అతి ప్రాచీన భాష తమిళమని అమిత్ షా వ్యాఖ్య
  • అలాంటి గొప్ప భాషలో మాట్లాడలేనందుకు క్షమించాలని కోరిన అమిత్ షా
  • వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే ఓడిపోతుందని జోస్యం

ప్రపంచంలోనే అతి ప్రాచీన భాష తమిళమని, అటువంటి గొప్ప భాషలో మాట్లాడలేకపోతున్నందుకు తనను క్షమించాలని తమిళ ప్రజలను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కోరారు. జాతీయ విద్యావిధానంలో భాగమైన త్రిభాషా సూత్రం అమలుపై తమిళనాడు, కేంద్ర ప్రభుత్వాల మధ్య వివాదం కొనసాగుతోంది.

ఈ నేపథ్యంలో, తమిళనాడులోని కోయంబత్తూరులో జరిగిన ఓ కార్యక్రమంలో అమిత్ షా పాల్గొన్నారు. 2026లో జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో డీఎంకే ఓడిపోవడం ఖాయమని జోస్యం చెప్పారు. 2024 బీజేపీకి చారిత్రక ఏడాదిగా నిలిచిందని ఆయన అన్నారు.

అదే సంవత్సరం నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించారని, చాలా ఏళ్ల తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చిందని, మహారాష్ట్ర, హర్యానా, ఇటీవల ఢిల్లీ ప్రజలు బీజేపీపై విశ్వాసం ఉంచారని తెలిపారు. కుటుంబ రాజకీయాలను, అవినీతిని అంతం చేస్తూ 2026లో తాము విజయం సాధిస్తామని అన్నారు.

  • Loading...

More Telugu News