Kotappakonda: కోటప్పకొండలో వైభవంగా మహాశివరాత్రి వేడుకలు

Mahashivaratri Celebrations In KotappaKonda Temple
  • తెల్లవారుజామున 2 గంటలకు తొలిపూజ
  • భారీగా తరలివచ్చిన భక్తులు
  • 3 వేల మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు
ఆంధ్రప్రదేశ్ లోని పల్నాడు జిల్లా కోటప్పకొండపై మహాశివరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. కొండపై కొలువై వున్న త్రికోటేశ్వర స్వామికి బుధవారం తెల్లవారుజామున 2 గంటలకు తొలిపూజ ప్రారంభమైంది. ఆలయ పూజారులు బిందెతీర్థంతో స్వామి వారికి అభిషేకం చేశారు. తొలిపూజకు పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. ఎమ్మెల్యే అరవిందబాబు, ఆలయ ఈవో చంద్రశేఖర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహాశివరాత్రి వేడుకల్లో భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని ఈవో తెలిపారు.

మూడు వేల మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేసినట్లు పోలీసు ఉన్నతాధికారులు పేర్కొన్నారు. శాంతిభద్రతల పర్యవేక్షణ కోసం పోలీసులు ఉపయోగించిన డ్రోన్ ఆలయ క్యాంటీన్ సమీపంలోని విద్యుత్ తీగలపై పడింది. దీంతో ట్రాన్స్ ఫార్మర్ లో మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన అధికారులు తాత్కాలికంగా క్యాంటీన్ ను మూసివేశారు. అనంతరం విద్యుత్ సరఫరా నిలిపివేసి డ్రోన్ ను కిందికి దించారు. మరమ్మతుల అనంతరం విద్యుత్ సరఫరా పునరుద్ధరించినట్లు అధికారులు తెలిపారు.
Kotappakonda
Mahashivaratri
Temple
Andhra Pradesh

More Telugu News