Revanth Reddy: ప్ర‌ధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ

CM Revanth Reddy Meets PM Modi

   


ప్రధాని నరేంద్ర మోదీతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స‌మావేశమ‌య్యారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మోదీతో భేటీ కావడం ఇది మూడోసారి. ముఖ్య‌మంత్రి వెంట ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, ఇత‌ర ఉన్న‌తాధికారులు ఉన్నారు. 

ఇక ఈ భేటీలో ఎస్ఎల్బీసీ టన్నెల్ లో చిక్కుకున్న 8 మంది కార్మికులను బయటకు తీసుకువచ్చేందుకు చేస్తున్న సహాయక కార్యక్రమాలను ప్రధానికి రేవంత్ రెడ్డి వివరించినట్లు స‌మాచారం.

అలాగే బీసీ కుల గణన, ఎస్సీ వర్గీకరణ అంశాలను ప్రధానికి సీఎం వివరించార‌ని తెలిసింది. దీంతో పాటు విభజన హామీలు, పెండింగ్ నిధులు, ప‌లు ప్రాజెక్టులకు కేంద్ర ప్ర‌భుత్వం సాయంపై రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేసిన‌ట్లు తెలుస్తోంది.

Revanth Reddy
PM Modi
Telangana
  • Loading...

More Telugu News