Priests Break Dance: శ్రీకాకుళం జిల్లాలో ఆలయ అర్చకుల బ్రేక్ డ్యాన్స్... వీడియో వైరల్

సాధారణంగా ఆలయాల్లో పనిచేసే అర్చకులంటే ఏదో సంప్రదాయబద్ధంగా, ఆచారాలు పాటిస్తూ ఓ టైపులో ఉంటారని అనుకుంటాం. కానీ శ్రీకాకుళం జిల్లా మందస గ్రామంలోని శ్రీ వాసుదేవ పెరుమాళ్ ఆలయ అర్చకులు మాత్రం డిఫరెంట్. వాసుదేవ పెరుమాళ్ స్వామివారిబ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయ అర్చకులు డీజే పాటలకు బ్రేక్ డ్యాన్స్ చేసి చూపరులను విస్మయానికి గురిచేశారు.
స్వామివారి ఊరేగింపులో అర్చకులు ఎంతో ఉత్సాహంగా డ్యాన్పులు చేస్తూ ఎంజాయ్ చేశారు. వారిలో ఒకరు పాములా మెలికలు తిరుగుతూ షేక్ డ్యాన్స్ ను కూడా మిక్స్ చేశారు. గ్రామంలోని కుర్రకారుతో పోటీ పడుతూ ఆ అర్చకులు తమ డ్యాన్స్ టాలెంట్ ను ప్రదర్శించడం విశేషం.
ఇన్నాళ్లు తమలో ఉన్న కళను అందరికీ చూపించాలన్న కసితో వాళ్లు డ్యాన్స్ చేసినట్టుగా అనిపిస్తోంది. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.