Chandrababu: పవన్ కల్యాణ్ ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా... ఎందుకంటే...: సీఎం చంద్రబాబు

- అసెంబ్లీలో చంద్రబాబు ప్రసంగం
- పవన్ పంచాయతీరాజ్ శాఖను బ్రహ్మాండంగా నడిపిస్తున్నారన్న సీఎం
- రోడ్ల విషయంలోనే కాస్త అసంతృప్తి ఉందని వెల్లడి
అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగించారు. ఏపీలో స్వచ్ఛాంధ్ర ప్రదేశ్ కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రతి మూడో శనివారం స్వచ్ఛాంధ్ర ప్రదేశ్ కు కేటాయించామని, పరిశుభ్రంగా ఉండే ప్రతి నియోజకవర్గానికి అవార్డులు ఇస్తామని అన్నారు.
"ఇవాళ పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఎందుకంటే... పల్లె పండుగ కింద ఒకే రోజున రాష్ట్రంలోని అన్ని పంచాయతీల్లో జనరల్ బాడీ మీటింగ్ లు పెట్టి... అన్ని వర్క్ లకు నిధులు ఒక్కరోజులో మంజూరు చేసిన ఘనత భారతదేశంలో ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే దక్కింది. గతంలో ఇలాంటి కార్యక్రమాలు ఉన్నా... అవి అప్పుడప్పుడు చేసేవాళ్లు. కానీ పవన్ బ్రహ్మాండంగా నాయకత్వం వహించి ముందుకు తీసుకెళుతున్నారు. అది అందరికీ స్ఫూర్తిదాయకం.
గతంలో ఫైనాన్స్ కమిషన్ డబ్బులన్నీ డైవర్ట్ చేశారు. ఆ డబ్బులు తిరిగి చెల్లించి.... సెకండ్ ఇన్ స్టాల్ మెంట్ తీసుకువచ్చిన ఘనత పవన్ కే చెల్లింది. ఇప్పుడు పంచాయతీ శాఖను బలోపేతం చేసే బాధ్యతను తీసుకున్నారు. అన్నీ బాగానే చేస్తున్నారు కానీ... ఇంకా రోడ్ల విషయంలోనే కొంచెం అసంతృప్తి ఉంది. ఏ విధంగా చేయాలో ఆలోచిస్తున్నట్టుంది. ఫర్వాలేదు... సంకల్పం ఉంటే మార్గాలుంటాయి... మనం కలసికట్టుగా కృషి చేద్దాం" అంటూ చంద్రబాబు వివరించారు.